ఆత్మకూర్ గ్రామ నూతన మరకత ఆత్మలింగేశ్వర ఆలయ నూతన కమిటీ ఏర్పాటు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ గ్రామస్తుల సమక్షంలో సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.ఆలయ కమిటీ అధ్యక్షులుగా కుంట రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులు గడ్డం బాల్రెడ్డి, సెక్రటరీ డి.రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారిగా బి.రామగౌడ్, ఆడిటర్ ఉత్తమ్ రెడ్డి, సలహాదారు జంపాటీ నారాయణరెడ్డి, కమిటీ మెంబర్స్ వసంత్ రెడ్డి, కుమ్మరి మధు, నాయకోటి ఈశ్వర్, అవసుల సుదర్శన్, కోడూరు ఈశ్వరయ్య, నాగరాజు, పార్టీమీది సుభాన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎలక్ట్రిషన్ రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి వారు ఆయాభివృద్ధికి సహకరిస్తామని, ఆలయాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.






