6 May, 2026 | 11:27 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ప్రశంసించిన టీపిసిసి ప్రధాన కార్యదర్శి

03-03-2026 09:07 PM

మంథని,(విజయక్రాంతి): యూత్ లీడర్ నవీన్ భాయ్ డైనమిక్ లీడర్ అని టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ప్రశంసించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను శ్రీనుబాబు అభినందించారు.

శ్రీపాదరావు జయంతి వేడుకల్లో మంథని నియోజక వర్గం నుంచే కాకుండా, రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొందిన యూత్ నాయకుడు నవీన్ యాదవ్ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన అనంతరం శ్రీను బాబును కలిసి అలింగణం చేసుకొని ఒకరికొకరు కాసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తీరును శ్రీనుబాబు వివరించారు.