మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
06-05-2026 09:40 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు మరియు రామచంద్రాపురం గ్రామాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మల్లెలమడుగు గ్రామంలో సర్పంచ్ మచ్చా నరసింహరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరిపారు. అలాగే రామచంద్రాపురం గ్రామంలో సర్పంచ్ భూరెడ్డి స్వాతి, భూరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.






