25 June, 2026 | 3:01 AM

నీటి సంపులో పడి చిన్నారి మృతి

25-06-2026 12:51 AM

తట్టుకోలేక గుండెపోటుతో నాయనమ్మ మరణం

జనగామ, జూన్ 24 (విజయక్రాంతి): జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో ఏడాదిన్నర వయసుగల రియాన్స్ అనే చిన్నారి ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి దుర్మరణం పాలైంది. ఈ సంఘటన అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన ఆమె నాయనమ్మ నాగమ్మ (65) గుండెపోటుతో కుప్పకూలి మరణించింది. గంటల తేడాలో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.