15 March, 2026 | 1:53 AM

శుభకార్యానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు

15-03-2026 12:25 AM
  1. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి 
  2. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన మోటార్ సైకిల్ 
  3. మెదక్ జిల్లా రాంపూర్ శివారులో ఘటన

మెదక్/కొల్చారం, మార్చి 14(విజయక్రాంతి) : బంధువుల ఇంట్లో జరిగిన శుభకా ర్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆర్టీ సీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన శనివారం సాయంత్రం మెదక్ జిల్లా కొల్చా రం మండలం రాంపూర్ శివారులో చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షులు, మృతుల బంధువుల కథనం ప్రకారం హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (50), అతని కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ (12), అలాగే అల్లుడు సాయ గౌ డ్ (35) కలిసి మండలంలోని రంగంపేట గ్రామంలో శనివారం జరిగిన తమ బంధు వు ఇంటి తొట్టెల కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక అనంతరం ఇంటికి తిరిగి వె ళ్తున్న సమయంలో మెదక్- హైదరాబాద్ 765 డి జాతీయ రహదారిపై రాంపూర్ శి వారులో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వై పు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తు లు అక్కడికక్కడే మృతి చెందారు.సంఘటనా స్థలిని మెదక్ రూరల్ సీఐ జార్జ్ సంద ర్శించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ మొహమ్మద్ మో హినుద్దీన్ కేసు నమోదు చేసి, మృతదేహాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి.విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.