7 May, 2026 | 1:25 AM

మున్సిపల్ కమిషనర్ కు టీఎన్జీవోస్ ప్రతినిధుల సన్మానం

07-05-2026 12:28 AM

కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన టి పర్వతాలుని కామారెడ్డి జిల్లా టిఎన్జీవోస్ పక్షాన బుధవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, జిల్లా కోశాధికారి ఎమ్ దేవరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖదీర్, మున్సిపల్ ఫోరం జిల్లా బాధ్యులు గోపాల్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఫోరం భాద్యులు సయ్యద్ మీర్, తిరుపతి, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.