మమతకు బిగ్ షాక్... TMC MP కాకొలి ఘోష్ దస్తీదార్ రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(All India Trinamool Congress) అధినేత్రి మమతా బెనర్జీనికి భారీ షాక్ తగిలింది. పార్టీ నాయకత్వం పట్ల తన అసంతృప్తిని బహిరంగంగా వెలిబుచ్చిన కొద్ది రోజులకే లోక్‌సభ సభ్యురాలు కాకోలి ఘోష్ దస్తిదార్( TMC Lok Sabha MP Kakoli Ghosh Dastidar resigns) బుధవారం నాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని తన అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. తన పార్టీ పాల్గొనవద్దని సూచించిందని ఆరోపణలు ఉన్నప్పటికీ, కళ్యాణిలో ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్వహించిన పరిపాలనా సమీక్షా సమావేశానికి ఆమె హాజరైన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. దస్తిదార్ TMC మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. పార్టీకి చెందిన బంగా జనని కార్యక్రమంతో అనుబంధం కలిగి ఉన్నారు.






