జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల మహాత్మాగాంధీ జ్యోతిబాపూలె BC గురుకుల పాఠశాల కళాశాలను గురువారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లను పరిశీలించి నాణ్యతా లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మొదట భోజనశాలను తనిఖీ చేసి, విద్యార్థుల కోసం వంటలో వినియోగించే అన్ని రకాల కూరగాయలు, పప్పులు, దినుసులు సక్రమంగా కలిపి రుచికరంగా వండాలని తయారీదారులకు సూచించారు. స్టోర్ రూంలోని ఆహార పదార్థాలు బియ్యం, పప్పులు, ఇతర సరుకులు, దినుసులు, కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా తెప్పించుకోవాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






