31 July, 2026 | 1:09 AM

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

31-07-2026 12:41 AM

తిప్పారం గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్..

గాంధారి, జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని గాంధారి మండలం తిప్పారం గ్రామ సర్పంచ్ సోలంకి ప్రమోద మాధవరావ్ సూచించారు.. మండలంలో కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు నిండుతున్నాయని, గాంధారి పెద్ద వాగులో వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో తిప్పారం గ్రామ ప్రజలకు ఆమె పలు సూచనలు చేశారు..

మండల కేంద్రానికి తిప్పారం గ్రామానికి గల రహదారి మద్యలో గల వాగుపై లోలెవెల్ వంతన ఉన్న కారణంగా వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.. స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ యువరాజ్, ఎఎస్‌ఐ ప్రకాష్ లతో కలిసి లోలెవెల్ వంతెనను పరిశీలించారు.. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు సోలంకి మాధవరావు పాల్గొన్నారు..