సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
30-07-2026 09:14 PM
సర్పంచ్ సుభాష్ నాయక్
చేగుంట,(విజయక్రాంతి): సీజనల్ వ్యాధులుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జైత్రం తండా సర్పంచ్ సుభాష్ నాయక్, పంచాయతీ సెక్రటరీ రాధా ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది కలిసి తండాలోని ప్రజలకు ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్య నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా, చెత్త చెదారం ఇంటి చుట్టూ ఉండకుండా చూసుకోవాలని, వాన కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధా. ఆరోగ్య సిబ్బంది పద్మ, ప్రమీల, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






