27 May, 2026 | 4:25 PM

కేరళం మాజీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల కారు ధ్వంసం

27-05-2026 03:17 PM

తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister of Kerala), ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్( Pinarayi Vijayan) ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బేకరీ జంక్షన్‌లోని విజయన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. లోపల ఈడీ సోదాలు జరుగుతుండగా ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు దాడి చేయడంతో గందరగోళం చెలరేగింది. సీపీఎం కార్యకర్తల దాడిలో పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈడీ అధికారుల కారును సీపీఎం కార్యార్తలులు ధ్వంసం చేశారు. పినరయి విజయన్ నివాసాలతో సహా కేరళలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించడాన్ని నిరసిస్తూ ఈ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

అక్కడ మోహరించిన భద్రతా సిబ్బందిపై ఆగ్రహించిన సీపీఐ(ఎం) కార్యకర్తలు హెల్మెట్లు, ప్లాస్టిక్ సీసాలు, రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం, ఈ ఉదయం పొద్దుపొద్దున్నే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ప్రారంభమైనప్పటి నుండి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు ఇంటి లోపలే ఉన్నారు. ఈడీకి, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వందలాది మంది CPI(M)( Communist Party of India (Marxist)) కార్యకర్తలు ఆ నివాసం వెలుపల గుమిగూడటం, వారిలో కొందరు ప్రధాన ద్వారం గుండా ఆ ప్రాంగణంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.