తెలంగాణలో మరోసారి ఈడీ దాడులు
27-05-2026 03:52 PM
హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో బుధవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. కరీంనగర్, హైదరాబాద్(Hyderabad) లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. నాలుగు కంపెనీలకు సంబంధించి ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. GST(Goods and Services Tax) కట్టకుండా కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.






