11 April, 2026 | 3:45 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •  

కారు, ప్రైవేట్ బస్సు ఢీకొని ముగ్గురి మృతి

27-12-2025 03:16 AM
  1. మరో ముగ్గురికి గాయాలు
  2. మృతులు సూర్యాపేటకి చెందిన వారిగా గుర్తింపు
  3. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో ఘటన

అమరావతి, డిసెంబర్ 26: గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపం లో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వెంకయ్య(70), సుశీల(64), మహే ష్ అనే యువకుడు, మరికొందరు కుటుంబసభ్యులు తిరుపతికి కారులో వెళ్లి తిరిగొ స్తున్నారు. 

మార్గంమధ్యలో ఆపిన కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందా రు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సౌత్ డీఎస్పీ భానోదయ, సీఐ వంశీధర్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమా ద వివరాలను తెలుసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.