17 June, 2026 | 4:02 AM

సమయపాలన పాటించని నల్ల మట్టి బకాసురులు

17-06-2026 01:30 AM

చోద్యం చూస్తున్న అధికారులు

వేములపల్లి, జూన్ 16: నల్ల మట్టి రవాణా రాత్రి వేళలో యదేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధ నల ప్రకారం 6 గంటల వరకే రవాణా కొనసాగించా లి. సూర్యాపేట జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ చెరువు నుండి నల్లమట్టిని అక్రమంగావేములపల్లి మం డలంలోని భీమారం సూర్యాపేట రహదారిపై రవాణా కొనసాగుతుంది. ఈ రవాణాపై అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని రావు వారి గూడెం గ్రామ శివారులో ఉన్న ఇటుక బట్టీలకు ఈ మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడ రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు కార్లను మాత్రమే తనిఖీ చేస్తున్నారని నైట్ టైం లో నడిచే మట్టి టిప్పర్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని వాహనదారులు చర్చించుకుంటున్నారు. అతివేగంగా వస్తున్న ఈ వాహనాలని వదిలి పెట్టడంతో వాహనాదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.