50 క్వింటాళ్ల మక్కలు చోరీ
ఆరబోసిన సంచులను ఎత్తుకెళ్లిన దొంగలు
రహదారిపై బైఠాయించి రైతుల నిరసన
నిర్మల్ జిల్లా వెంకురలో ఘటన
నిర్మల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): దొంగలు సాధారణంగా నగదు, నగలు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగతనం చే యడం సహజమే. అయితే నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని వెంకుర గ్రామంలో జాతీయ రహదారిపై 50 క్వింటాళ్ల మొక్కజొన్నల సంచులను దొంగలు శనివారం రాత్రి ఎత్తుకెళ్లారు. రైతు నారాయణరావు పటేల్ రెండెకరాల మొక్కజొన్నను నూర్పిడి చేసి కల్లూరు కుంటాల రహదారిపై ఆరబోశాడు. ఉదయం జొన్నలు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
ప్రధాన రహదారిపై ఉన్న జొ న్నలు చోరీకి గురైందనే విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల రైతులు పెద్ద ఎత్తున తర లివచ్చి బాధిత రైతుకు మద్దతుగా నిలిచి, రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్‌ఐ అశోక్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. దొంగలను పట్టు కుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. గతేడాది ఇదే తరహాలో పత్తి, మొక్కజొన్న, సో యా పంటలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతు లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దొంగతనం జరిగిన పంట విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు నారాయణరావు వాపోయాడు.




