బొల్లారంలో చోరీ... 25 తులాల వెండి మాయం
బాధితుల ఇంటి వద్ద నుండి దరఖాస్తు స్వీకరించిన ఎస్సై భార్గవ్ గౌడ్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బొల్లారం గ్రామానికి గన్నారం దేవయ్య, పర్వయ్య కుమారుడు వారి ఇంట్లో దొంగలు పడడంతో బాధితులు డయల్ 100 నెంబర్కు సమాచారం అందించగా అట్టి సమాచారం మేరకు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ బాధిత కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ...బాధితులు జనవరి నెల నుండి హైదరాబాదులో నివసిస్తూ జీవన్ ఉపాధి కోసం ఆటో నడిపిస్తున్నారు.
గురువారం సుమారు ఏడు గంటలకు బాధితులు గ్రామానికి వచ్చి ఇంటిని పరిశీలించగా అల్మారులో ఉంచిన సుమారు 25 తులాల వెండి ఆభరణాలు కనిపించడం లేదని బాధితులు ఫిర్యాదు మేరకు ఎస్సై భార్గవ్ గౌడ్ బాధిత కుటుంబాన్ని ఇంటి వద్దకు కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ ప్రతిని ఉచితంగా బాధితునికి అందజేయడం జరిగిందన్నారు. గోపాల్పేట్... జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని సీఐ. రాజారెడ్డి సందర్శించారు. పరీక్షల నిర్వహణ విధానం, భద్రత ఏర్పాట్లను పరిశీలించి పరీక్ష ప్రశాంతంగా సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.




