6 May, 2026 | 3:14 AM

గోలీల్లేవు!

06-05-2026 01:57 AM

ఈఎస్‌ఐ దవాఖానల్లో రోగులకు మందుల కష్టాలు

  1. ఆస్తమా, క్యాన్సర్, కిడ్నీ, లివర్ బాధితులకు కొరత 
  2. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఈఎస్‌ఐ రోగులు 
  3. ప్రైవేటుగా రూ.వేలు ఖర్చుపెట్టి మందులు కొనలేని దైన్యం
  4. ఆక్సిజన్ కాన్సట్రేటర్‌ను అద్దెకు తెచ్చుకుంటున్న రోగులు 
  5. ఏజెన్సీలకు కోట్లమేర బిల్లులు పెండింగ్
  6. మందులు పంపిణీ చేయలేమంటున్న సరఫరాదారులు
  7. పట్టించుకోని ఉన్నతాధికారులు

క్యాన్సర్, కిడ్నీ మందుల కొరత..

లెటరాజోల్, సోఫోసిబివర్, కెపసిటబైన్, మైకోఫిట్, మోడోసిస్, ఇంజక్షన్ క్రెస్ప్, ఇంజక్షన్ మెడిసిరా, ఇంజక్షన్ ఎంజిమాబ్, రివరాక్సోబిన్, సావలాంబర్, నెఫ్రోసేవ్, మాల్గాన్, ఎవర్‌లిమస్, టాక్రోలిమస్, మెర్సిడా లాంటి మందులు క్యాన్సర్, కిడ్నీ పేషంట్లకు అత్యవసరం. వీటిని సరైన సమయంలో వాడకపోతే రోగుల ప్రాణాలకే ప్రమాదం.

పైగా క్యాన్సర్ రోగులకు ఇచ్చే కొన్ని ఇంజక్షన్లు.. రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటాయి. ఇక కిడ్నీ రోగులకు ఇచ్చే మందులు కూడా రూ. వేలల్లో ఉంటాయి. ఈ మందుల కొరత కారణంగా రోగులు అల్లాడిపోతున్నారు. బయట రూ. వేలు ఖర్చుపెట్టి కొనలేక, వాడకపోతే ప్రాణాలు దక్కవనే భయంతో రోగులు దినదినగండంగా బతు కులు వెళ్లదీస్తున్నారు.

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ) ఆసుపత్రుల్లో మందుల కొరత.. రోగుల ప్రాణాలకు సంకటంగా మారింది. గోలీల్లేకపోవడంతో రోగులు పరిస్థితి దయనీ యంగా మారింది. కొంత కాలంగా పలు రకాల వ్యాధిగ్రస్తులకు అత్యవసరంగా అందించే మందులకు కొరత ఏర్పడింది. సరఫరాదారుల నుంచి ఆయా మందులు రావడం లేదు. రూ.కోట్లమేర పాత బిల్లు లు పేరుకుపోవడం, బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం కారణంగా తాము సరఫరా చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.

బాధితులు తమకు కావాల్సిన మం దుల కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. మందులు లేకపోవడంతో తమ ప్రాణాలను నిలుపుకునేందుకు చాలాసా ర్లు ప్రైవేటుగా కొనుక్కుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం (ఈఎస్‌ఐ)లోని ఉన్నతాధికారులు స్పందించడం లేదు.

లివర్ మందులు..

క్రియాన్, పాంక్రియాటిన్ మందులు లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అత్యవసరం. అయితే ఈ మందులు ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. బాధితులు బయట మెడికల్ షాపుల్లో డబ్బులు పెట్టి కొనుగోలుచేసి వాడుకుంటూ తమ ప్రాణాలను నిలుపుకుంటున్నారు.

ఆక్సిజన్ అందేది ఎలా..

ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులు పూర్తిస్థాయిలో గాలిని పీల్చుకోలేరు. అం దుకే ఆక్సిజన్ కాన్సట్రేటర్‌ను ఉపయోగిస్తారు. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ఆక్సిజన్ కాన్సట్రేటర్ ధర సుమారు రూ.60 వేల వరకు ఉంటుంది. వీటిని ఈఎస్‌ఐకి సరఫరా చేయడం లేదు. కారణం ఇప్పటికే రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండ టం. దీంతో ఉపిరితిత్తుల వ్యాధిగ్రస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.60 వేల వరకు ఖర్చు చేయలేక.. బయటి నుంచి నెలకు రూ.5 వేల వరకు అద్దె పద్ధతిలో ఆక్సిజన్ కాన్సట్రేటర్లను తెచ్చుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు.

ఉచిత మందులు ఏవీ..

వాస్తవానికి ఈఎస్‌ఐ లబ్ధిదారులందరికీ ఎలాంటి అనారోగ్యం బారినపడినా అది తగ్గించేందుకు పూర్తి వైద్య చికిత్సగానీ, మందులనుగానీ పూర్తి ఉచితంగా అందిస్తారు. మిగతా వారితో ఈఎస్‌ఐ లబ్ధిదారులను పోల్చిచూస్తే బయటి వారికైనా ఒకటీఆరా ఖర్చు ఉంటుందేమో గానీ, ఈఎస్‌ఐ లబ్ధిదారులకు మాత్రం ఒక్క పైసా ఖర్చు లేకుండా చికిత్సలు అందిస్తారు. అందించాలికూడా. పూర్తి పెయిడ్ సర్వీస్ అయిన.. ఈఎస్‌ఐలోనూ రోగులు కొన్ని అత్యవసర మందుల కోసం ఖర్చుచేయాల్సి వస్తున్నది.

క్యాన్స ర్, లివర్, కిడ్నీ, ఆస్తమా లాంటి కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులకు గురైన బాధితులకు అందించే మందులు కొంత కాలంగా ఈఎస్‌ఐ అసుపత్రుల్లో లభించడం లేదు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోగులు ఆసుపత్రుల చుట్టూ తిరిగితి రిగి వేసారిపోతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు. తమ ప్రాణా లు నిలుపుకునేందుకు రోగులు అప్పులు చే సి.. ఆస్తులు అమ్ముకుని సైతం మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుక్కొని జీవితాలను నెట్టుకొస్తున్నారు.

బిల్లులు పెండింగ్.. నిర్లక్ష్యంగా ప్రభుత్వం

వాస్తవానికి కేంద్రం నుంచి ఠంచనుగా నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఈఎస్‌ఐ పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినవస్తూనే ఉన్నాయి. సాధారణ మందులకు కొరత లేకున్నప్పటికీ ప్రాణాంతక క్యాన్సర్ వంటి వ్యాధితోపాటు కిడ్నీ, లివర్, ఆస్తమా లాంటి బాధితులకు ఇవ్వాల్సిన అత్యవసర మందుల కొరతతో వారు లబోదిబోమంటున్నారు.

ఈఎస్‌ఐ ఆ సుపత్రులకు మందులను సరఫరాచేసే ఏజన్సీలు మాత్రం.. తమకు చెల్లించాల్సిన బిల్లు లు పెండింగ్‌లో ఉన్నాయని, అవి చెల్లిస్తేనే మందులు సరఫరా చేస్తామంటు న్నాయి. అయితే ప్రభుత్వం నిధులు ఉన్నప్పటికీ వా టిని ఇతర అవసరాలకు ఉపయో గించు కుంటూ బిల్లుల చెల్లింపును నెలలు, ఏండ్లు గా పెండింగ్‌లో ఉంచుతున్నాయి. దీంతో మందుల సరఫరాదారులు చేతులెత్తేస్తున్నా రు. ఇది అంతిమంగా క్యాన్సర్, కిడ్నీ, లివర్, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు శాపంగా మారింది.

భారీ ధరలో ఉండే క్యాన్సర్ ఇంజక్షన్లు, మందులు, కిడ్నీ వ్యాధి మందులు, ఆస్తమా రోగులకు తప్పనిసరిగా కావాల్సిన ఆక్సిజన్ కాన్సట్రేటర్లను బయట కొనుగోలు చేయలేక.. ఇటు ప్రాణా లు నిలుపుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తున్నది. చిన్నచిన్న ఉద్యోగాలు, ఫ్యాక్యటరీల్లో పనిచేసే కార్మికులకు వచ్చేదే అతి తక్కువ జీతభత్యాలు. అందులో నుంచే ప్రతినెలా ఈఎస్‌ఐకి వాటా చెల్లిస్తుంటారు.

ఇలా చెల్లించిన లబ్ధిదారుల వాటాతోనే ఈఎస్‌ఐలను నడిపి స్తుంటారు. అలాంటిది నిధులు ఉన్నా మందులు, ఇంజక్షన్లను రోగులకు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.