6 May, 2026 | 3:38 AM

రైతుల అరిగోస పట్టించుకోరా?

06-05-2026 02:17 AM
  1. మోదీ సభను డైవర్ట్ చేసేందుకే డ్రామాలు
  2. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వాడుకోని అసమర్థ ప్రభుత్వం
  3. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్ రూరల్, మే 5(విజయక్రాంతి): ప్రధాని మోదీ బహిరంగసభపై వస్తున్న ఆదరణను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ సీబీఐ విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ ఆగ్రహాం వ్యక్తంచేశారు. రాష్ట్రం లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలో రైతులు అరిగోస పడుతున్నా, వడదె బ్బకు తాళలేక చచ్చిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని, వడ్ల కొనుగోలు కోసం టోకెన్లు ఇవ్వడా నికి కూడా దళారులు కమీషన్లు దండుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు. మంగళవారం బం డి సంజయ్ కరీంనగర్‌లోని ఖాజీపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఈతిబాధలు తెలుసుకు న్నారు. ఒక్కోరైతు రూ. 20వేలకు పైగా నష్టపోయే దుస్థితి నెలకొందని మంత్రివద్ద రైతు లు వాపోయారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మండుటెండల్లో రోజుల తరబడి ధాన్యం విక్రయానికి రైతులు ఎదురుచూస్తు న్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారని ఆగ్రహాం వ్యక్తంచేశారు. కొనుగో లు కేంద్రాల వద్ద రైతులు అరిగొస పడుతున్నారని, ప్రతిగింజకు కేంద్రమే పైసలిస్తుంటే కొనేం దుకు ఎందుకు ఇబ్బందని నిలదీశారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే కేవలం 15 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారా? అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్లు ఇ చ్చేందుకు కూడా కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల కష్టార్జితాన్ని దోచు కుతింటున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించరా? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం కేంద్రం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధు లు మంజూరు చేసినా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం ఇదన్నారు.

ఢిల్లీకి కప్పం కట్టేందుకు, కేరళ ఎన్నికల కోసం ఖర్చు చేసేందుకు వేల కోట్లు ఇస్తారని, రైతులు చచ్చిపోతుంటే కనీసం స్పందించాలన్న సోయి కూడా లేదా? అని నిలదీశారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర దాటినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్ర శ్నించారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదా? కేసీఆర్‌తో ఇన్నాళ్లు బేరసారాలాడారా? బేరసారాలు చెడిపోయాయి కాబట్టే కేంద్రానికి లేఖ రాస్తున్నారా అని విమర్శించారు.

మా భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్‌ను కాల్చాలనుకుంటున్నారా? అని నిలదీశారు. ఐదు రాష్ట్రాల ఫలితాలను డైవర్ట్ చేసేందుకే సీబీఐ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను అరెస్టు చేయడం చేతగాదని కేంద్రానికి లేఖ రాస్తే సీబీఐ విచారణపై కేంద్రం స్పందిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.