6 May, 2026 | 2:39 AM

గ్లోబల్ లీడర్

06-05-2026 01:44 AM

ఏరోస్పేస్ దిగ్గజాలకు వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ

  1. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లోనూ గ్లోబల్ హబ్
  2. ఎకోసిస్టమ్, ఇన్నోవేషన్, ఆర్‌అండ్‌డీ, ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్‌పై ప్రత్యేక దృష్టి
  3. ‘ఐటీపీ ఏరో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ భూమి పూజలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కేవలం విడిభాగాల తయారీకే పరిమితం చేయకుండా గ్లోబల్ ఏరోస్పేస్ ఆర్‌అండ్‌డీ హబ్‌గా మార్చేందుకు అవసరమైన కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్ వేర్ పార్క్ (ఫేజ్ --3)లో రూ.453 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ‘ఐటీపీ ఏరో-ఇండియా’ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు మంగళవారం శ్రీధర్‌బాబు భూమి పూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనతికాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలిపామన్నారు.

వరుసగా అయిదేళ్లు కేంద్రం నుంచి ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్’ అవార్డును అందుకోవడం రాష్ట్రంలోని పటిష్ఠ మైన ఎకో సిస్టమ్‌కు నిదర్శనమని చెప్పారు. బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, లాక్హీడ్ మార్టిన్, టాటా వంటి గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలు ఇప్పటికే ఇక్కడ కార్యకలా పాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. తాజా గా ఈ జాబితాలో స్పెయిన్ దిగ్గజ సంస్థ ‘ఐటీపీ ఏరో’ కూడా చేరడంతో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందని పేర్కొన్నారు.

సంప్రదాయ తయారీ రంగంతోపాటు డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాంటి నెక్‌స్ట్ జనరేషన్ టెక్నాలజీస్‌లోనూ రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ, ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.

విమాన ఇంజిన్ల తయారీలో వినియోగించే అత్యంత కీలకమైన విడిభాగాలు ఈ ‘ఐటీపీ ఏరో ఇండియా’ నూతన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాం ట్‌లో ఉత్పత్తి అవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఇక్కడ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు.

ప్రిసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో ప్రాథమికంగా 350 మంది నిపుణులకు (హై స్కిల్డ్) ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 600కు పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీపీ గ్రూప్ సీఈవో ఈవా అజూలే, ఎండీ కార్లోస్ అల్జోలా, వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) వాలెంటిస్ గొరోనో, ఐటీపీ ఇండియా ఎండీ సందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

రెండు జీసీసీలు.. 3 వేల ఉద్యోగాలు 

రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన జర్మన్ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్ హైదరాబాద్‌లో రెండు జీసీసీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొ చ్చింది. గ్లోబల్ డిజిటల్ హబ్, గ్లోబల్ సర్వీసెస్ హబ్‌ల పేరుతో నెలకొల్పే ఈ రెండు జీసీసీలకు రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రం సమర్పించింది.

మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జర్మన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్‌ల సమక్షంలో బీఏఎస్‌ఎఫ్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్ తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మా ట్లాడుతూ.. ఈ ఏడాది 100 జీసీసీల ఏర్పా టు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.

వీటి ద్వారా లక్ష మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. హైదరాబాద్ కేవలం కార్యాలయాల కేం ద్రంగా మాత్రమే కాకుండా, ఆవిష్కరణలు, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.  కృత్రిమ మేథస్సు ఆధారిత కేంద్రం ఐకామ్, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, 200 ఎకరాల్లో ఏఐ సిటీ, క్వాంటమ్ హబ్, జీవ విజ్ణాన పరిశోధన్ సంస్థ ‘1 బ యోల్యాబ్’లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

బీఏఎస్‌ఎఫ్‌కు 160 ఏళ్ల చరిత్ర

160 ఏళ్ల చరిత్ర కలిగిన బీఏఎస్‌ఎఫ్ ప్రపంచవ్యాప్తంగా కెమికల్స్, మెటీరియల్స్, సర్ఫేస్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సొల్యూషన్స్, న్యూట్రిషన్ కేర్ తదితర రంగాల్లో 200కి పైగా దేశా ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని శ్రీధర్‌బాబు తెలిపారు. 234 కర్మాగారాలు, 1,08,000 మంది ఉద్యోగుల తో పనిచేస్తున్న ఈ సంస్థ వార్షిక ఆదాయం దాదా పు 5 లక్షల కోట్ల రూపాయలు (60 బిలియన్ డాలర్లు)గా ఉందన్నారు. ప్రపంచం లోని పలు నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఈ ప్రతిష్ఠాత్మక అవకాశాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని చెప్పారు.

ఎన్విడియా, మై క్రోసాఫ్ట్, గూగుల్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్ లాం టి దిగ్గజ సంస్థలు ఇక్కడ జీసీసీలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని తెలిపారు. కార్యక్ర మంలో బీఏఎస్‌ఎఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలెగ్జాండర్ గెర్డింగ్, గ్లోబల్ బిజినెస్ సర్వీ సెస్ అధ్యక్షుడు టోబియాస్ డ్రాట్, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ అడ్వయిజర్ సా యికృష్ణ తదితరులు పాల్గొన్నారు.