అమ్మాయిలు అదరగొడతారా?
టీ20 ప్రపంచకప్‌కు రెడీ
పూర్తి ఫామ్‌లోకి లేని బ్యాటర్లు
బౌలింగ్‌పైనా ఆందోళన
మహిళల క్రికెట్‌లో వన్డే ఛాంపియన్ భారత్‌కు అందని ద్రాక్షగా ఊరిస్తోంది టీ20 ప్రపంచకప్... 2020లో తృటిలో టైటిల్ చేజారడం తీవ్రంగా నిరాశపరిచినా ఇప్పు డు ఆటపరంగా బాగా మెరుగైన హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యం లోని భారత మహిళలకు పొట్టి ప్రపంచకప్ గెలిచేం దుకు మంచి అవకాశం.. మరి క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ అదరగొడుతుందా... ?
లార్డ్స్, జూన్ ౧౦ : మహిళల క్రికెట్‌లో వన్డే రారాణులుగా ఉన్న భారత జట్టు ఇప్పు డు మరో సవాల్‌కు సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరగబోతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా సన్నద్ధమైంది. జూన్ 12 నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో భారత్ కూడా ఉంది. గత టోర్నీ ల్లో నిరాశపరిచినా ఈ సారి మాత్రం అం చనాలు పెరిగాయి. దీనికి కారణం గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవడమే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి మేటి జట్లను నిలవరించి వన్డేల్లో ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు తమకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలవాలని పట్టు దలగా ఉంది.
2009 నుంచి 2024 వరకూ నాలుగు సార్లు సెమీఫైనల్స్ చేరిన భారత్ ఒకసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2020లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న హర్మన్‌ప్రీత్ సేన ఇప్పుడు అంచనాలతో బరిలోకి దిగుతోంది. వన్డేల్లో మెరుగ్గానే రాణిస్తున్న భారత మహిళల జట్టు టీ20ల్లో మాత్రం అనుకున్న రీతిలో ఆడడం లేదు.గత కొన్ని సిరీస్‌లలో మిశ్రమ ఫలితాలు వచ్చా యి. శ్రీలంక, ఆసీస్ జట్లపై సిరీస్‌లు గెలిచినా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై పరాజ యాలు చవిచూసింది. ఈ మెగా టోర్నీ కోసం భారత మహిళల జట్టును చూస్తే బ్యాటింగ్ లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఓపెనర్లుగా మెరుపు ఆరంభాలనిస్తే తిరుగుండదు.
ముఖ్యంగా లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ వన్డే ప్రపంచకప్‌లో ఎ లాంటి ఇన్నింగ్స్‌లు ఆడిందో అందరూ చూసా రు. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో కూడా షెఫాలీ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్మృతి కూ డా ఫామ్ అందుకోవడం, హర్మన్ ప్రీ త్ అనుభవం టీమిండియాకు కలిసొచ్చే అంశా లు. యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫినిషర్ రోల్ లో రిఛా ఘోష్‌పై మంచి అంచనాలున్నాయి. అటు బౌలింగ్‌లో మాత్రం మెరుగువ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇంగ్లాండ్ పిచ్‌లపై మన పేసర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి పరుగులు నియంత్రించలేకపోతుండడం ఇబ్బందిగా మారిం ది. అటు స్పిన్నర్లు మా త్రం రాణిస్తున్నారు. శ్రేయాంక పాటిల్, రాధాయాద వ్ లకు తోడు దీప్తి శర్మ, శ్రీచరణిలతో స్పిన్ విభాగం బలంగా ఉంది. స్పిన్‌కు అంత అనుకూలించని ఇంగ్లీష్ పిచ్‌లపై వీరు మ్యాజిక్ చేయగలిగితే భారత్‌కు ఎదురులేనట్టే. పాకిస్థాన్‌తో జూన్ 14న జరిగే మ్యాచ్‌తో భారత జట్టు టైటిల్ వేట మొదలవుతుంది.
టీ20 వరల్డ్‌కప్‌కు భారత మహిళల జట్టు
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధా న, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
భారత్ ప్రపంచకప్ గత రికార్డు
2009 సెమీఫైనల్స్
2010 సెమీఫైనల్స్
2012 గ్రూప్ స్టేజ్
2014 గ్రూప్ స్టేజ్
2016 గ్రూప్ స్టేజ్
2018 సెమీఫైనల్స్
2020 రన్నరప్
2023 సెమీఫైనల్స్
2024 గ్రూప్ స్టేజ్
భారత్ మహిళల జట్టు షెడ్యూల్
జూన్ 14 : భారత్ X పాకిస్థాన్ (బర్మింగ్‌హామ్)
జూన్ 17 : భారత్ X నెదర్లాండ్స్ (లీడ్స్)
జూన్ 21 : భారత్ X సౌతాఫ్రికా (మాంచెస్టర్)
జూన్ 25 : భారత్ X బంగ్లాదేశ్ (మాంచెస్టర్)
జూన్ 28 : భారత్ X ఆస్ట్రేలియా (లార్డ్స్)






