11 June, 2026 | 3:16 AM

భారత మహిళల ఓటమి

11-06-2026 01:07 AM

రిఛా ఘోష్ పోరాటం వృథా

టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్

కార్డిఫ్, జూన్ 10: మహిళల టీ20 ప్ర పంచకప్ రెండో వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఇంగ్లాం డ్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓడిపోయిం ది. కీలక బ్యాటర్లు విఫలమవడం భారత్ ఓటమికి కారణమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మంచి స్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ అమీ జోన్స్ , కెప్టెన్ నాట్ సీవర్ బ్రాంట్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అమీ జోన్స్ 45 బంతుల్లో 64 (8 ఫోర్లు) ఔటవగా... బ్రంట్ 45 బంతుల్లో 57 (8 ఫోర్లు) పరుగులు చేసింది. చివర్లో గిబ్సన్ దూకుడుగా ఆడి కేవలం 12 బంతుల్లోనే 30 (4 ఫోర్లు,1 సిక్సర్ ) పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేయగలిగింది. తర్వాత ఛేజింగ్‌లో భారత్ తడబడింది. 18 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (1), షెఫాలీ వర్మ (13) నిరాశపరిచారు.

తర్వాత యాస్తికా భాటియా(15), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (17), భారతి పు ల్మాలీ (17) కూడా త్వరగానే ఔటయ్యారు. ఫలితంగా భారత మహిళల జట్టు 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశ లో రిఛా ఘోష్ అద్భుతంగా పోరాడింది. రాధా యాదవ్, శ్రీచరణిలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి ఓవర్లో విజయం కోసం 17 పరుగులు చేయాల్సి ఉండగా.. వరుసగా ఫోర్, సిక్సర్ బాదిన రిఛా నాలుగో బౌంతికి స్టంపౌట్ అవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. రిఛా 36 బం తుల్లో 68 (9 ఫోర్లు, 12 సిక్సర్లు) పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, గిబ్సన్ 2, డీన్ 2 వికెట్లు పడగొట్టారు.