14-02-2026 12:17:12 AM
షాద్‌నగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఒకే పార్టీ నుంచి పోటీ చేసిన భార్య గెలుపొందగా భర్త ఓటమి చెందారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ తరఫున తొమ్మిదవ 9వ వార్డు నుంచి చేకూరి వేణుగోపాల్ పోటీ చేయగా, ఆయన భార్య లక్ష్మీప్రసన్న 28వ వార్డు నుంచి రంగంలోకి దిగింది. శుక్రవారం వెలుబడిన ఫలితాలలో లక్ష్మీప్రసన్న విజయం సాధించగా, వేణుగోపాల్ పరాజయం పాలయ్యారు.