28 August, 2026 | 4:15 AM

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

28-08-2026 12:20 AM

జిల్లా గ్రంధాలయం చైర్మన్ అంజయ్య  

రాయికోడ్ ఆగస్టు 27: రాయికోడ్ మండల పరిధిలోని ఉల్గేరా గ్రామంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఒక్కకోటి 5 లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సిద్దన్న పటేల్, బసవరాజ్ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలాజీ, నర్సింహులు రైకోడ్ దేవాలయ అధ్యక్షులుసతీష్ కులకర్ణి ప్రభు నరసింహులు స్థానిక సర్పంచ్ నర్సింలు యాదవ్, కుసునూరు సర్పంచ్ రాజశేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.