‘రాఖీ బంధం’ సంతకాల ప్రచారం
రంగారెడ్డి, అగస్టు 27 (విజయక్రాంతి): జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ’బేటీ బచావో బేటీ పడావో’లో భాగంగా ‘రాఖీ బంధం బాలికల భద్రతకు మన ప్రతిజ్ఞ‘ పేరిట భారీ రాఖీ ప్రదర్శన, సంతకాల ప్రచార కార్యక్రమం(Signature Campaign) నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ బాలికలకు విద్య, భద్రత, సమాన అవకాశాలు కల్పించడం సమాజం మొత్తం బాధ్యత అని, దీనితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ఆడపిల్లలు ఉన్నత చదువులతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు కిరణ్మయి, చంద్రారెడ్డి, బి డబ్ల్యు ఓ శాంతి శ్ర వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని సంతకాల ద్వారా మద్దతు తెలిపారు.






