28 March, 2026 | 2:13 AM

వైభవోపేతం రాములోరి కల్యాణం

28-03-2026 12:00 AM
  1. కల్యాణశోభను సంతరించుకున్న పలు ఆలయాలు

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులు 

నిర్మల్/లక్షెట్టిపేట/లక్ష్మణ చందా/కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, మార్చి 27 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయం వద్ద కృషియుయందు పరిష త్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్, ఏ స్పిలు ఉపేందర్ రెడ్డి సాయికిరణ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ రాజ్య స్థాపన కోసం రాముడు ఆదర్శమూర్తిగా రాజ్యాన్ని పరిపాలించారని గుర్తు చేశారు.

ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన కాషాయ జెండాలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు నిర్మ ల్ జిల్లాలోని వివిధ రామాలయాల్లో శ్రీరామనవ వేడుకలను పురస్కరించుకుని సీతా రాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని తిలకించి మొక్కలు చెల్లించుకున్నారు.

బాగులవాడలో మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య కావ్య గణేష్ పాల్గొని బీద పండితులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు విట్టల్ కపిల్ బిజెపి నాయకులు  భూమయ్య. సుధాకర్. ఇతరులు పాల్గొన్నా రు. గ్రామాల్లో హనుమాన్ ఆలయాల వద్ద శ్రీరామనవమి వేడుకలను హనుమాన్ భక్తు లు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

లక్షెట్టిపేట పట్టణం తో పాటు మండల వ్యాప్తంగా శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయాలన్నీ రామనామ స్మరణతో మారు మోగాయి. పట్టణంలోని ప్రధా న హనుమాన్ మందిర కమిటీ ఆధ్వర్యంలో శ్రీపాటి బండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి ఫంక్షన్ హాల్లో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం జరిగింది.

ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు భారీస్థాయిలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. అదే విధంగా బీట్ బజార్లోని కన్యకా పరమేశ్వరి వాసవి మాత ఆలయంలో, మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల హనుమాన్ మందిరంలో, వాసవి మా త ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాలలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

లక్ష్మణచందా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయా లు రాముని ఆలయాల్లో ఉదయం నుండి పూజలు నిర్వహించారు. హనుమాన్ భక్తు లు గ్రామాల్లో ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రా మాల సర్పంచులు. అయిట్ల లక్ష్మి సుదర్శన్ పసుపుల  నరేష్ అబ్బటి పుష్ప రాజేశ్వర్ ఉప ఉప సర్పంచ్‌లు విద్యాసాగర్ రెడ్డి రవీందర్ గంగారెడ్డి వీడిసి సభ్యులు ఆలయ కమి టీ సభ్యులు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జంకాపూర్ శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు నిమ్మకంటి సంతోష్ శర్మ, శిరీష్ శర్మ, శ్రీధర్, తిరుపతి విజయ్ కుమార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ సీత రాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె హరిత, ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులు కోవ సాయినాథ్-హారిక,శ్రీ కేశవనాథ ఆలయ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు.

అంతకుముందు పట్టణంలోని ప్రధా న వీధుల గుండా రామాలయం వరకు శోభయాత్రను ఉత్సవ విగ్రహాలతో అత్యంత ఉత్సాహ భరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగు ణ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,మున్సిపల్ చైర్మన్ మంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, స్థానిక నాయకులు నాగేశ్వరరావు ,బాలేష్ గౌడ్, మల్లేష్, విశాల్,కౌన్సిలర్లు చిలువరి వెంకన్న, కొండు భారతి, వినోద్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కాగజ్ నగర్ పట్టణంలోని పలు ఆలయాల్లో శుక్రవారం వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం నిర్వహించారు. పట్టణంలోని ఈఎస్‌ఐ పరిధిలోని అభయ ఆం జనేయ దేవాలయం, శ్రీ త్రినేత్ర శివాల యం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం, రైల్వే రామాలయం, మారుతి నగర్ హనుమాన్ ఆలయం, నౌకంబస్తీలోని విద్యానగర్ లో పాటు ప్రధాన దేవాలయాలలో  మహోత్సవం కనుల పండుగ సాగింది. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో  పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాముని జీవితం అందరికీ ఆచరణీయం 

మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, మార్చి 27 : శ్రీరాముడు ఆచరించిన జీవితం మన అందరికీఆదర్శనీయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి మండలం పాలచెట్టు ప్రాంతంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగులతో కలిసి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.

శ్రీరాముడు నీతి, నిజాయితీ ఆచరించి ఆదర్శనీయంగా నిలిచారని, ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనశాంతి కలుగుతుందన్నారు. అనంతరం మంత్రి నియోజక వర్గంలోనీ క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీ, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాలలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.