జరిమానాలతోనే సరి?
- అక్రమ కలప దందాకు రూ.13,300 జరిమానా
సామిల్‌లో అక్రమంగా కలప నిలువ
పట్టుకున్న ఫారెస్ట్ అధికారి
తాత్కాలిక చర్యలే అంటున్న ప్రజలు
జడ్చర్ల, మార్చి 27 : ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వృక్షాలను నేలమట్టం చేస్తూ యధేచ్చగా అక్రమంగా కలపను తరలిస్తున్న సంబంధిత అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దొరికితేనే జరిమానా లేకుంటే దర్జాగా ఎవరి వ్యాపారం వారు చేసుకోవచ్చు అనేలా ఉంది జడ్చర్ల ఫారెస్ట్ అధికారుల తీరు అని ప్రజలు చెబుతున్న మాట. జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాల నుంచి నిత్యం పదుల సంఖ్యలతో అక్రమార్కులు ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్ లేకుండా కవర్లు కప్పి రాత్రి, పగలు సమయంలో ఇష్టారాజ్యంగా ముసుగులో కోనసాగుతున్న కలపను యధేచ్చగా తరలిస్తున్నారు.
చెట్టును నరకాలంటే ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టనట్లు అటవీ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వానికి రుసుము చెల్లించకుండా నిత్యం వందలాది చెట్లను నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం చెట్లను నరకరాదని నరికిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేస్తున్న అక్రమార్కులు మాత్రం యధేచ్చగా కలప దందాను కొనసాగిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం వేళ యచర్థగా కల్పన తరలిస్తుండగా జడ్చర్లలో సామిల్లకు తరలిస్తుండగా చుట్టుపక్క వారు చూసి అధికారులకు సమాచారం ఇవ్వగా సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సామిల్ స్థలానికి చేరుకొని అక్రమంగా తరలిస్తున్న కలపను గుర్తించి వివరాలు సేకరించి అనంతరం లైసెన్సులు లేకుండా అక్రమ కల్ప రవాణా చేసినట్లు గుర్తించారు.
పటేల్ సత్యనారాయణ సామిల్ గా గుర్తించి కట్టెల తరలింపునకు సంబంధిత అనుమతి లేకపోవడంతో మహబూబ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి సంబంధిత అధికారి రూ 13300 వేల జరిమానా విధించారు. అనుమతులు లేనిది వృక్షాలను ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదని ఆదేశించారు.
పట్టుకునేది లేదు.. పక్కా సమాచారం ఇస్తేనే...
చెట్లను ఎక్కడపడితే అక్కడ నరికి వేస్తున్న ఫారెస్ట్ అధికారులు మాత్రం ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నారని ఆరోపణలు పొందుకుంటున్నాయి. పక్కా సమాచారం ఎవరైనా ఇస్తే తప్ప అటువైపు చర్యలు తీసుకునే పరిస్థితి లేదని ప్రజలు బహిరంగంగానే చెబుతున్న మాట.
చెట్లను నరకకుండా నియమ నిబంధనలను అమలు చేస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతూ అడుగులు వేయవలసిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా చెట్లను నరక వేసి కవర్ కప్పి అక్రమంగా తరలిస్తున్న పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రం ప్రత్యేక చర్యలు తీసుకొని చెట్లు నరికివేతకు గురికాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.




