4 April, 2026 | 1:38 AM

పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య

04-04-2026 12:02 AM

అదనపు కలెక్టర్ చంద్రయ్య

నస్పూర్, ఏప్రిల్ 3 : నిజాం నిరంకుశ పాలనలో ప్రజల సంక్షేమం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమరయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహాల సంక్షేమ అధికారు లు, యాదవ, కురుమ కుల సంఘాల ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.