4 April, 2026 | 3:26 AM

జోరు కొనసాగించేదెవరు?

04-04-2026 01:31 AM

నేడు ఢిల్లీతో ముంబై ఢీ

పృథ్వీషాకు ఛాన్స్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఐపీఎల్ లో మళ్లీ వీకెండ్ వచ్చేసింది. అభిమానులను అలరించేందుకు డబుల్ హెడర్స్ సిద్ధమయ్యాయి. శనివారం రెండు మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ను ఎంట ర్ టైన్ చేయబోతున్నాయి. మధ్యాహ్నం జరి గే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడి యం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లూ టోర్నీని మంచి విజయాలతో ఆరంభించడంతో రసవత్తర పోరు ఖాయం గా కనిపిస్తోంది. ముఖ్యంగా హోం గ్రౌండ్‌లో దుమ్మురేపేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురుచూస్తోంది.

తొలి మ్యాచ్ లో ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. బౌలిం గ్ తో అద్భుతంగా రాణించి, బ్యాటింగ్‌లో తడబడినా సమీర్ రిజ్వీ విధ్వంసంతో పాటు స్టబ్స్ మెరుపులతో చక్కని విజయాన్ని అం దుకుంది. ముంబై ఇండియన్స్ పైనా అదే జోరు కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఢిల్లీ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన నిస్సాంకను తప్పించి పృథ్వీషాను తీసుకునే అవకాశముంది. గత ఏడాది కాలంగా తన కెరీర్‌ను గాడిన పెట్టుకునేందుకు శ్రమిస్తున్న పృథ్వీషాకు ఈ సీజన్ మంచి అవకాశం.

అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీనే కొనసాగించడం ఖాయం గా కనిపిస్తోంది. ఢిల్లీ బ్యాటింగ్‌లో రాహుల్, నితీష్ రాణా, మిల్లర్, విప్రజ్ నిగమ్ పై అంచనాలున్నాయి. బౌలింగ్ పరంగా మా ర్పులు లేనట్టే. మిఛెల్ స్టార్క్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో లుంగి ఎంగిడి, నటరాజన్, ముఖేశ్ కుమార్ పేస్ ఎటాక్‌లో కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో వీరంతా రాణించారు. మరోవైపు ముంబై ఇండియ న్స్ కూడా ఈ సీజన్‌ను ఘనవిజయంతో మొదలుపెట్టింది.తద్వారా ప్రతీ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయే సంప్రదాయానికి చెక్ పెట్టింది.

రోహిత్ శర్మ, రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆరంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. భారీ టార్గెట్ ను అలవోకగా ఛేదించి ముంబైకి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ లాంటి హిట్టర్స్ అంతా ముంబై జట్టులోనే ఉన్నారు. అటు సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ గా కొనసాగించడం ఖాయమైంది. బౌలింగ్ లో బుమ్రా, బౌల్ట్, శార్థూల్ ఠాకూర్ పేస్ బౌలింగ్‌ను నడిపిస్తున్నారు. ఈ బౌలింగ్‌ను తట్టుకుని పరుగులు చేయడం ఢిల్లీ బ్యాటర్లకు సవాల్ గానే చెప్పాలి. 

గత రికార్డులు

గత రికార్డుల్లో ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 37 మ్యాచ్‌లలో తలపడితే ముంబై 21 సార్లు గెలిచింది. ఢిల్లీ 16 మ్యాచ్ లలో విజయం సాధించింది. 

పిచ్ రిపోర్ట్

ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలిస్తుం ది. బౌండరీలు చిన్నవి కావడంతో సిక్సర్ల మోతతో పరుగుల వరద ఖాయమని అంచనా.

తుది జట్లు అంచనా

ఢిల్లీ క్యాపిటల్స్ : కెఎల్ రాహుల్(కీపర్), పృథ్వీషా, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), స్టబ్స్, మిల్లర్, విప్రజ్, ఎంగిడి, కుల్దీప్, నటరాజన్, ముకేశ్ కుమార్

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా (కెప్టెన్), నమన్‌ధీర్, రూథర్‌ఫర్డ్, శార్థూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే,ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా