4 April, 2026 | 1:43 AM

వనవాసి విద్యానిలయానికి వితరణ

04-04-2026 12:01 AM

కుమారుని జన్మదినం సందర్భంగా బియ్యం, భోజనం, పండ్లు పంపిణీ

చర్ల, ఏప్రిల్ 3, (విజయక్రాంతి): చర్ల మండలం మామిడిగూడెం వాస్తవ్యులు తోకల దీక్షిత్ - పార్వతి దంపతుల కుమార్తె దర్శిని జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం, విద్యార్దులకు భోజనం, పండ్లను ఏర్పాటు చేసారు. విద్యార్ది నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అద్యక్షతన జరిగిన ఈ  సమావేశంలో ప్రదానోపాద్యాయురాలు అరుణకుమారి మాట్లాడుతూ విద్యార్దులు చదువులపై దృష్టిసారించి ఉన్నతులు కావాలన్నారు.

మారుమూల అటవీప్రాంత గ్రామాలకు చెందిన విద్యార్దులను ఇక్కడకు తీసుకువచ్చి నాణ్యమైన విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించడం అభినందనీయమన్నారు. దేశ వ్యాప్తంగా వనవాసి  442 విద్యార్థినిలయాలను వడ్డీ టపాక నిర్వహిస్తున్నామన్నారు. దాతలు సహకారంతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిలయ కమిటీ ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, పాల్గొన్నారు.