29 May, 2026 | 2:05 AM

విలేజ్ పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి

29-05-2026 01:13 AM

సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి

ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ క్రైం, మే 28: విలేజ్ పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ను నిర్వాహణను పరిశీలించాడు. శాంతిభద్రల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమీక్షించారు.

స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, క్రైమ్ ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరా పనితీరు, కోర్టు సంబంధిత రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఫిర్యాదును విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విల్లేజ్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు చేరువ కావాలని తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామ స్థాయి సమాచార వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.

దొంగతనాలు, చోరీలు, ఇతర ఆస్తి నేరాల నివారణకు రాత్రి, పగలు పటిష్ట గస్తీ నిర్వహించాలని, హైవేలు, గ్రామ శివార్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టి, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను తరచుగా తనిఖీ చేయాలని తెలిపారు.

సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి,ఎస్బి సీఐ ఆది రెడ్డి, 2టౌన్ సీఐ రాఘవ రావు,రూరల్ ఎస్.ఐ సైదా బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.