పల్లె దవాఖాన, పీహెచ్‌సీ సబ్ సెంటర్ను వెంటనే తెరవాలి
జోనల్ కమిషనర్ సాంచిత్ గంగ్వార్‌కు వినతి
అల్వాల్, ఆగస్ట్ 28, (విజయక్రాంతి): కౌకూర్ ప్రజల కోసం ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన, పీహెచ్ సీ సబ్ సెంటర్ను వెంటనే తెరవాలని మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్ కోరారు.
ఈ సమస్యపై మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సాంచిత్ గంగ్వార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని ఎక్సైజ్ కార్యాలయంగా మార్చడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఈ భవనాన్ని ఎక్సైజ్ కార్యాలయానికి కాకుండా వార్డు ఆఫీస్, స్ట్రీట్ లైట్స్ ఆఫీస్, యువతకు జిమ్, విద్యార్థులకు గ్రంథాలయం, సానిటేషన్ కార్యాలయం వంటి ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.






