25 June, 2026 | 3:36 AM

యూరియా యాప్‌ను వెంటనే ఎత్తివేయాలి

25-06-2026 12:00 AM

తెలంగాణ రక్షణ సేన మండల అధ్యక్షులు భుజంగరావు 

తాడ్వాయి, జూన్24 (విజయ క్రాంతి): ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ ను ఎత్తివేయాలని తెలంగాణ రక్షణ సేన తాడ్వాయి  మండల అధ్యక్షులు భుజంగరావు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా యూరియా కోసం యూరియా యాప్ ను ప్రవేశ పెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నిరక్షరాస్యులయిన రైతులకు యాప్ లో బుక్ చేసుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచు కొని ప్రభుత్వం యాప్ ను ఎత్తివేయాలని కోరారు. మండలంలో ఐదు రకాల పంటలు వేస్తారని అన్ని పంటలకు సరిపోయే విధంగా యూరియా సరఫరా కావడం లేదని ప్రభుత్వం స్పందించి అన్ని పంటలకు అవసరమయ్యే యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్ర మంలో నాయకులు సాయిలు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.