30 June, 2026 | 9:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

చోరీకి గురైన ఫోన్‌లు బాధితులకు అందజేత

06-02-2026 01:21 AM

పాపన్నపేట,ఫిబ్రవరి 5:చోరికి గురైన మొబైల్ ఫోన్ లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్‌ఐ సార శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 13 ఫోన్ లను గురువారం ఠాణాలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 475 ఫోన్ లు చోరికి గురికాగా ఇప్పటి వరకు 439 చరవాణిలను బాధితులకు అందించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ లను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు.