30 June, 2026 | 8:43 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

06-02-2026 01:22 AM

పాపన్నపేట,ఫిబ్రవరి 5:మండల కేంద్రం పాపన్నపేటలోని మర్రి చెట్టు వద్ద ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా పూల తో అలంకరించారు.

ఉదయాన్నే గణపతి పూజ, సింధూరం, విశేష పూజల అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తు లు పాల్గొన్నారు.