30 June, 2026 | 10:32 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు

30-06-2026 09:32 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): వన మహోత్సవంలో భాగంగా మండలంలోని అక్కంపల్లి గ్రామంలో గల హరితవనాలు, ఫిట్టింగ్ వర్క్ పనులను డి.ఆర్.డి.ఓ.కుటుంబరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ కుటుంబరావు మాట్లాడుతూ... వర్షాలు పడేలోపు గుంతలు పూర్తిచేసి వర్షం పడితే ప్లాంటింగ్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. నాగిరెడ్డిపేట్ మండలంలో మొత్తం 54000 మొక్కలు నాటడం లక్ష్యంగా ఉందని తెలిపారు. ఒక గ్రామ పంచాయతీకి 2000 మొక్కలు కచ్చితంగా నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సాయిలు,గ్రామ కార్యదర్శి కిష్టయ్య తదితరులు ఉన్నారు.