డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక
30-06-2026 09:10 PM
పాపన్నపేట: తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన బసవలింగప్ప ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదులో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే యూసఫ్ పేటకు చెందిన రమేష్ శర్మ ముఖ్య సలహాదారుగా ఎన్నికవడం విశేషం. తమపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు ఇరువురు రాష్ట్ర అధ్యక్షులు వాసుధేవ్ శర్మ, జిల్లా అధ్యక్షులు రాజేశ్వర శర్మ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.






