30 June, 2026 | 10:44 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గడ్డపోతారంలో 12వ వార్డు అభివృద్ధే లక్ష్యం

06-02-2026 01:21 AM

బీఆర్‌ఎస్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్ 

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): గడ్డపోతారం మున్సిపాలిటీలోని 12వ వార్డు అభివృద్దే మా అభిమతం అని బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్ తెలిపారు. ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా రు. ఇంటింటి ప్రచారంలో ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్ ప్రచారాన్ని ఆదరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్థానికులుగా ప్రజల సమస్యలను గుర్తించుకుని బాధ్యతగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నమ్ముకున్న ప్రజలకు అందుబాటులో ఉండిసేవ చేస్తామన్నారు. వార్డు అభివృద్ధే మా అభిమతం అని తెలిపారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.