30 June, 2026 | 10:32 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

30-06-2026 09:48 PM

పెంచికల్‌పేట్,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల పురోగతి, కార్యాలయ నిర్వహణను పరిశీలించిన ఆమె, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, ఫిర్యాదులను చట్టప్రకారం త్వరగా పరిష్కరించాలని, నేరాల నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది కిట్, వరద సహాయక చర్యల్లో ఉపయోగించే లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రిని పరిశీలించి, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాహిదుద్దీన్, కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్‌పేట్ ఎస్సై అనిల్, ఎస్‌ఐలు సందీప్ కుమార్, రమేష్  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.