30 June, 2026 | 10:31 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం

30-06-2026 09:44 PM

జవహర్‌నగర్,(విజయక్రాంతి): రాంకీ డంపింగ్ యార్డును తొలగించే లక్ష్యంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ, దమ్మాయిగూడ జేఏసీ ఉమ్మడి కార్యాచరణకు అంగీకరించాయి. జవహర్‌నగర్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో చైర్మన్ షేక్షావలి, కన్వీనర్ డాక్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు వాయు, నీటి కాలుష్యంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

2016 నుంచి దమ్మాయిగూడ జేఏసీ ఈ సమస్యపై న్యాయపోరాటం కొనసాగిస్తోందని పేర్కొంటూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. డంపింగ్ యార్డును పూర్తిగా తొలగించే వరకు జవహర్‌నగర్, దమ్మాయిగూడ జేఏసీలు కలిసి ఉద్యమాన్ని కొనసాగించాలని సమావేశంలో తీర్మానించారు.

ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ: 

డంపింగ్ యార్డ్ లో ఉన్న తాజా చెత్తను  బయోమైనింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని, మురుగు నీటి ప్రవాహాన్ని తొలగించి, ప్రజలకు ఉచిత మంచినీటి వైద్య సౌకర్యాలు కల్పించాలని దుర్వాసనను అరికట్టాలని డంపింగ్ యార్డ్ మూసివేత వల్ల నగరంలో చెత్త సంక్షోభం రాకుండా ఉండేందుకు జిహెచ్ఎంసి తక్షణమే వికేంద్రీకరణ వ్యర్ధాల ప్రాసెసింగ్ ప్రత్యామ్నాయ సైట్లను ఏర్పాటు చేసి ఎస్ డబ్ల్యూ ఎం రూల్స్ 2016 ప్రకారం మూసివేసిన తర్వాత కనీసం 15 సంవత్సరాల పాటు పోస్ట్ క్లోజర్ మానిటరింగ్ చేపట్టాలని తెలిపారు. 

భవిష్యత్ కార్యాచరణను రెండు సంస్థలతో త్వరలో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు నరసింహ గౌడ్ ఎస్ కే మీరా పి శివ బాబు కో కన్వీనర్స్ గడ్డం సదానందం తోటపల్లి శంకర్ శివన్నారాయణ మేక లలిత యాదవ్ సుబ్రహ్మణ్యం గొడుగు వేణు యక స్వామి, మహమ్మద్ భాషా మియా మల్లేష్ ప్రవీణ్ అనంతలక్ష్మి పెరక సునీత చంద్రన్న ప్రసాద్ మాధవరెడ్డి సయ్యద్ సత్యనారాయణ లక్ష్మీబాయి రాణి జె ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.