30 August, 2026 | 8:26 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది

30-06-2026 09:43 PM

ముకరంపుర,(విజయక్రాంతి): రాష్ట్రంలో కులవివక్షకు కొన్ని కులాలు గురవుతున్నాయని. సామాజిక న్యాయం కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా  ప్రజల కోసం రాష్ట్రంలో పోరాటం చేస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా  రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కార్యాలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజేయ్ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ... రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఆర్పిఐ పార్టీ పనిచేస్తుందని నిరుపేదల కోసం నిరంతరం పార్టీ వారి సమస్యలపై పోరాటం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొన్ని కులాలు కుల వివక్షకు గురవుతున్నాయని కుల వివక్షకు గురైన కులాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి సామాజిక న్యాయం. అందించాలని కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎక్కడ చూసినా మహిళలపై కులవివక్షిత. మానసికంగా శరీరకంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అండగా ఉంటుందని అన్నారు.