హనుమాన్ ఆలయంలో చోరీ
30-06-2026 09:12 PM
తలమడుగు,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామ నగర నడిబొడ్డున ఉన్న హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ విగ్రహల యొక్క 2 వెండి కిరీటాలు వినాయకుని కళ్ళు దాదాపు 20తులాల వెండి అంచనా విలువ 50 నుంచి 60 వేల రూపాయలు ఉంటుంది స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జాగిలాలతో పరిశీలిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నామని ఎస్సై రాధిక తెలిపారు






