29 July, 2026 | 1:16 AM

ఎస్‌ఐఆర్ వేగవంతం చేయాలి

29-07-2026 12:14 AM

కొల్లాపూర్ రూరల్, జూలై 28: పారదర్శక, తప్పుల్లేని ఓటరు జాబితా తయారే లక్ష్యంగా ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కోడేరు మండలం పస్పుల గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం ఫామ్ ఫౌండ్ పనులను పరిశీలించారు.  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు విధుల పట్ల అలసత్వం సరికాదని సూచించారు.