29 July, 2026 | 1:17 AM

తండాల్లో శీత్లా భవాని వేడుకలు

29-07-2026 12:16 AM

ఆకట్టుకున్న పూజా విధానం 

భీమదేవరపల్లి, జూలై 28 (విజయక్రాంతి): గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్దకంగా జరుపుకునే పండుగ శీత్లా భవాని. గిరిజనులు ఆషాడ మాసం తొలి మంగళవారంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ దేవతలు ప్రకృతిని పశు సంపదను పిల్ల జెల్లను కాపాడాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో శీత్లాభవాని పండుగను జరుపుకుంటారు.

హనుమకొండ , సిద్దిపేట జిల్లాలో మంగళవారం  శీత్లాభవాని పండుగ వేడుకలు జరిగాయి. మంగళవారం జిల్లెల్లగడ్డ జరిగిన వేడుకల్లో మహిళలు బోనాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శీత్లాభవాని అనగా సప్త భవానిమాతలుగా గిరిజనులు కొలుస్తారు. సప్త భవాని మాతలుగా కొలిచే పర్వదినం రోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు.