వేగంగా ‘ఎస్‌ఐఆర్’ మున్సిపాలిటీ కమిషనర్ యాదగిరి
చేవెళ్ళ, జూలై 28(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని చేవెళ్ల మున్సిపాలిటీ కమీషనర్ బి. యాదగిరిఅన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్ట్ 3 నాటికి SIR ప్రక్రియను పూర్తి చేయవలసి ఉన్నదన్నారు.
అంచేత పట్టణ ప్రజలు చివరివరకు వేచి చూడకుండా , తప్పులు జరగకుండా నివరించేందుకు శనివారంకు ముందుగానే తమ SIR-ఎన్యుమరేషన్ ఫారాన్ని సంబంధిత బి.ఎల్.ఓ (BLO) లకు ఖచ్చితంగా అందజేయాలని కోరారు. ఏ ఒక్క అర్హులైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఈ గడువులోగా అందజేయాలని కోరారు.ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించనిచో ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తుందన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ‘హెల్ప్ డెస్క్‘ సేవలను పట్టణ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






