ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జూలై 27 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓట రు జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి 65 శాతానికి చేర్చాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు.సోమవారం బోరబండ డివిజన్ సైట్-1లోని సయ్యద్ తూర్బెజ్ ఖాన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే 52 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.బూత్ స్థాయిలో బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. రానున్న రోజులు అత్యంత కీలకమైనవని, ప్రతి బీఎల్‌ఏ మరింత బాధ్యతతో పనిచేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను లక్ష్యానికి చేర్చాలని సూచించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న బీఎల్‌ఏలకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తుందని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.ఈసమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇన్చార్జ్ మల్రెడ్డి రాంరెడ్డి, సీనియర్ నాయకుడు భవాని శంకర్, డివిజన్ అధ్యక్షుడు ఆనంద్, మహేష్ కాసుల, లక్ష్మణ్ గౌడ్, కుమార్, ఖయ్యుమ్, యాదయ్య, సరళ, కవిత, రేణుకమ్మ, మ హేందర్, వైజయంతి, రజ్వి, సుల్తాన్, సుధాకర్ రెడ్డి, జెశ్వంత్ రెడ్డి, అజీజ్, రవి నాయుడు తదితర కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






