28 July, 2026 | 1:50 AM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అదృశ్యం!

28-07-2026 01:18 AM

రంగంలోకి గాలింపు బృందాలు

రంగారెడ్డి,జిల్లా 27(విజయక్రాంతి): ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అకస్మాత్తుగా అదృశ్యం కావడం, అధికారులకు అం దుబాటులోకి రాకపోవడం ఇప్పుడు తీవ్ర కలకలానికి దారితీసింది. సాధారణంగా ఐపీఎస్ అధికారుల శిక్షణ, విధులు అత్యంత కట్టుదిట్టమైన ప్రొటోకాల్ ప్రకారం జరుగుతాయి. ప్రతి సమాచారం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. అలాంటిది, ఉద య్ కృష్ణారెడ్డి ఆకస్మాత్తుగా కనిపించకుండా పోవడంపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రం గా పరిగణిస్తున్నారు.

ఆయన అదృ శ్యం వెనుక ఉన్న కారణాలపై ప్రస్తుతం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పనుల నిమిత్తం సమాచారం ఇవ్వకుండా ఎక్కడికైనా వెళ్లారా? వృత్తిపరమైన ఒత్తిడా? ట్రైనింగ్, విధి నిర్వహణలో ఎదురయ్యే మా నసిక ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? మరేదైనా అవాంఛనీయ సంఘటనా?: అనుకోకుం డా ఏదైనా చిక్కుల్లో పడ్డా రా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.

పోలీసు శాఖ దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, అంతర్గతంగా ఈ వ్యవహారాన్ని అ త్యంత సీరియస్‌గా తీసుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. ఆయన చివరిగా ఉపయోగించిన సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజ్, ఆయన సన్నిహితులు, తోటి అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఆచూకీ లభించకపోవడం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.