13 July, 2026 | 1:19 AM

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి

13-07-2026 12:26 AM

బీఎల్‌ఏలు రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి 

మంత్రి దామోదర్ రాజనర్సింహ 

మునిపల్లి, జూలై 12: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ్ మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని మునిపల్లి, రాయికోడ్ మండలాల కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ ఏజెంట్స్ కు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటరు  జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిర్లక్ష్యం వీడాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల అనుభవాలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని బీఎల్‌ఏలకు మంత్రి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. అందుకు అవసరమైన అవగాహనను ఓటర్లకు కల్పించేలా కృషి చేయాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అలసత్వం లేకుండా బూత్  ల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఓటర్ల తో సమన్వయ చేసుకొని గడువులోగా సర్ ప్రక్రియను పూర్తిచేసి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ కోసం బూత్ లెవెల్ అధికారులకు అందించాలన్నారు. బీఎల్‌ఏలు  బూతుల వారిగా  సమన్వయం చేసుకొని సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జగన్ మోహన్ రెడ్డి, సతీష్, సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి, కేదార్నాథ్, సతీష్, సిద్దన్న పటేల్, బసవరాజు పాటిల్, మహంకాళి పాల్గొన్నారు.