13 July, 2026 | 1:19 AM

‘సుడా’కు పోటాపోటీ

13-07-2026 12:25 AM
  1. నేతల మధ్య తీవ్ర పోటీ
  2. రేసులోకి కొత్త నాయకులు
  3. అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు

కరీంనగర్, జూలై12(విజయక్రాంతి):కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అ థారిటీ  చైర్మన్ పదవీకాలం ముగియడంతో, ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తీవ్రమైన పోటాపోటీ నెలకొంది. ప్రస్తుత చైర్మన్ తన పదవిని కాపా డుకోవాలని చూస్తుండగా, పలువురు కొత్త నాయకులు కూడా ఈ రేసులోకి రావడంతో రాజకీయం వేడెక్కింది.  కోమటిరెడ్డి నరేంద ర్ రెడ్డి  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతుతో మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండేళ్ల అభివృద్ధి పనులు, పార్టీ సేవలను ఆయన ప్రధానంగా చూపిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఈసారి ఎలాగైనా కొత్త ముఖానికి అవకాశం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.చైర్మన్ రేసులో ఉన్న ప్రధాన నాయకులులో కోమటిరెడ్డి  నరేందర్ రెడ్డి .అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్, కాంగ్రెస్ నేత.మల్లికార్జున్ రాజేందర్, నేతలు సుజిత్ కుమార్, రాచకొండ చక్రాడర్, మాచర్ల ప్రసాద్ లు బీసీ కోటా కింద ఈ పదవిని ఆశిస్తున్నారు.   

అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది కరీంనగర్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరం గా మారింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇం చార్జీ మీనాక్షి నటరాజన్ పదవి కాలం ముగిసిన 30 మందిలో  ఐదుగురి పదవి కాలా న్ని పొడిగించాలని సూచించినట్టు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల కోమటిరెడ్డి పదవీకాలం పొడిగిస్తార  కొత్తవారికి ఇస్తారా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది