‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
గాంధారి, జూలై 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బుధవారం నాడు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన SIR ప్రక్రియను పరిశీలించి బి.ఎల్.ఓ. లకు పలు సూచనలు చేశారు, ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు.
అనంతరం మండల కేంద్రంలో నిర్మాణంలో గల ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణంలో జాప్యం చేయవద్దని ఆయన లబ్ధిదారులకు సూచించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు, అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు, అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఇటీవలే ఫిన్లాండ్ దేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యా వ్యవస్థపై అధ్యయనానికి వెళ్లి వచ్చిన బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని ని ప్రత్యేకంగా సన్మానించారు.. అనంతరం మహిళా సంఘం ద్వారా రుణం పొంది ఏర్పాటు చేసుకున్న కింగ్స్ బేకరి ని సందర్శించి యజమానిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మమ్మాయి రేణుకా సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, పాలక వర్గం సభ్యులు, డిఆర్డిఓ దామోదర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా విద్యాధికారి మల్లికార్జున్, గృహ నిర్మాణ సంస్థ పీడీ విజయ్ పాల్ రెడ్డి, ఎల్లారెడ్డి డిఇ, స్థానిక తహసిల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.






