1 July, 2026 | 12:57 AM

కాంగ్రెస్ పార్టీకి కోటయ్య చేసిన సేవలు ఎనలేనివి

01-07-2026 12:00 AM

గరిడేపల్లి, జూన్ 30 : కాంగ్రెస్ పార్టీకి కీత కోటయ్య చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కీత సోమయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కీతవారిగూడెంలో అనారోగ్యంతో మృతి చెందిన కోటయ్య భౌతికగాయానికి ఆ పార్టీ నాయకులు పిఏసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ మియాతో కలిసి పూలమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కండు వా కప్పి ఘనంగా నివాళులు అర్పించారు.

పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కోటయ్య ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్టీ నాయకులు మాజీ సర్పంచ్ ముత్తినేని సుబ్బయ్య,  సీనియర్ నాయకులు జుట్టుకొండ లక్ష్మీనారా యణ, చింతకాయల సైదులు, కీత మట్ట య్య, బాల్డురి అంజయ్య, కీత అంజయ్య, ముత్తినేని సోమయ్య, గుండు జానకయ్య,కీత చిన్న మట్టయ్య, కీత వెంకటేశ్వర్లు,గుండు సైదయ్య, పాలేల్లి ముత్తయ్య, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.